గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (20:08 IST)

24-11-2019 నుంచి 30-11-2019 వరకు రాశిఫలాలు- Video

మేషం : అశ్వని, భరణి, కృతిక 1వ పాదం. 
సంప్రదింపులు నిరుత్సాహపరస్తాయి. తప్పటడుగు వేస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆది, సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం అనుకూలించదు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. గృహమార్పు ఏమంత ఫలితమీయదు. మీపై శకునాల ప్రభావం అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రథమం. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం తక్కువ. పరిచయస్తుల ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ కించపరచవద్దు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. పరిస్థితుల అనుకూలత ఉండదు. చిన్న విషయమే ఆందోళన కలిగిస్తుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మంగళ, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెట్టుబడులకు తరుణంకాదు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పరిస్థితుల అనుకూలత ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అధిం. సంతృప్తికరం. పనులు సావధానంగా పూర్తిచేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాపు కలిసివస్తాయి. న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సరకు నిల్వలో జాగ్రత్త. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సమస్యలు సద్దుమణిగుతాయి. ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. సంస్థల పాలనలకు అనుకూలం. సంతానం విజయం సంతోషపరుస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పోగొట్టుకున్న పత్రాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం, ప్రశంసలు అందుకుంటారు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
ఖర్చులు అంచనాలు మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పెట్టుబడులకు అనుకూలం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. వేడుకలకు హాజరవుతారు. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. గురు, శుక్రవారాల్లో పత్రాలు సమయానికి కనిపించవు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు.
గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం ఆత్మీయులను కలుసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. దైవకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. సంతానం పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శనివారం నాడు నగుదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు మరొకరికి తెలియజేయవద్దు. భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. బాధ్యతగా వ్యవహరించాలి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
తుల : చిత్త, 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పనులతో సతమతమవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆది, సోమవారాల్లో పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. నిర్మాణాలు వేగవంతమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. మార్కెట్ రంగాల వారికి శ్రమ అధికం. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. ప్రలోభాలకు లొంగవద్దు. బుధ, గురువారాల్లో పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. భవన నిర్మాణ కార్మికులకు కొత్త సమస్యలెదురవుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యవహారానుకూలత ఉండదు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకుసాగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అనవసర జోక్యం తగదు. శుక్ర, శనివారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆహ్వానం అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. గృహమార్పు చికాకుపరుస్తుంది. ఆదివారం నాడు పనులు మొండిగా పూర్తి చేస్తారు. కార్యసాధనకు మరింతగా శ్రమించాలి. వ్యవహారానుకూలత ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. ఆప్తుల సలహా పాటించండి. పోగొట్టుకున్న వస్తువుల లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
వాగ్ధాటితో రాణిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు ఆదుకుంటారు ప్రతి విషయంలో మీదే పైచేయి. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టిపెడతారు. సోమ, మంగళవారాల్లో పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ఆభరణాలు, నగదు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పెట్టుబడులు, సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారాలు స్టాకిస్టులకు పురోభివృద్ధి. వేడుకల్లో పాల్గొంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పత్రాలు, నగదు జాగ్రత్త. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రం. అవకాశాలను వదులుకోవద్దు. వ్యాపకాలు అధికమవుతాయి. పనుల ప్రారంభంలో చికాకులెదుర్కొంటారు. శకునాలను పట్టించుకోవద్దు. బుధవారం నాడు ఊహించని సంఘటన లెదురవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. విందులు వినోదాల్లో పాల్గొంటారు.