సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (15:07 IST)

లంగావోణిలో రష్మిక మందన.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్ (video)

అవును లంగావోణిలో రష్మిక మందన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత రష్మిక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో రష్మిక బిజీ బిజీగా గడుపుతోంది. మహేష్‌తో షూటింగ్ కోసం రష్మిక కేరళ వెళ్లింది. అక్కడే వీరిద్దరి మీద పాటను షూట్ చేయబోతోన్నట్లు తెలుస్తోంది.
 
ఈ మేరకు కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లంగావోణిలో ఉన్న రష్మిక ఫోన్ ఆపరేట్ చేయడంలో మునిగిపోయి బిజీగా ఉంది. మరొక ఫోటోలో కొంటెగా చూస్తూ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కేలా చూస్తోంది. మొత్తానికి లంగావోణిలో ఉన్న రష్మికను చూస్తే అచ్చ తెలుగమ్మాయిలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇంకా రష్మికకు సరిలేరు ఎవ్వరూ అంటూ ట్వీట్ చేస్తున్నారు. 
 
మరోవైపు పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది రష్మిక. ఓ వైపు మహేష్ బాబు సినిమాలో నటిస్తూనే మరోవైపు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాష్టారు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఓకే అయింది.