సంబంధిత వార్తలు
- వైద్య సామాగ్రీ తయారీ చేస్తున్న పరిశ్రమలు, ఉద్యోగులకు ఆటంకం రానివ్వం : మంత్రి మేకపాటి
- కరోనా ఎఫెక్ట్ : హరియాణాలో బబుల్ గమ్‌లు నిషేధం
- కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఏం చెప్పిందో తెలుసా?
- ఇండియాలో కరోనాతో మత విద్వేషాలు పెరిగే ప్రమాదం: 'ది గార్డియన్' సంచలన కథనం!
- కరోనాకు మందు కనిపెట్టాం: డిస్ట్రిబ్యూటెడ్ బయో
ఏపీలో 149కు పెరిగిన కరోనా కేసులు
కరోనా మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రోజు రోజు కు కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 41 కేసులు బయటపడ్డాయి. నెల్లూరు అత్యధికంగా 23 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 149కు చేరింది.
పరీక్షించిన వాటిల్లో 1321 నెగెటివ్‌గా తేలాయి. ఉదయం పదిగంటలకు 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నాలుగు గంటలకు మరో మూడు నిర్థారణ అయ్యాయి.
ఆరుగంటలకు ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. రాత్రి పదిగంటలకు మరో 7 కేసులు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారివిగానే నిర్థారణ అయింది.
వైద్య సిబ్బందికి పిపిఇల సరఫరాకు చర్యలు : డాక్టర్ జవహర్ రెడ్డి
వైద్య సిబ్బందికి అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లా ఆస్పత్రికీ వెయ్యి వ్యక్తిగత సంరక్షణ పరికరాల(పిపిఇ)ను సరఫరా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు పరీక్ష కేంద్రాలతోపాటు గుంటూరు, కడపలో మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
