ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:25 IST)

కరోనా ఎఫెక్ట్‌ : హ‌రియాణాలో బబుల్‌ గమ్‌లు నిషేధం

కరోనా మహమ్మారి కట్టడికి హరియాణా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. తాజాగా బబుల్‌ గమ్‌ల అమ్మకాలపై నిషేధం విధించింది.

జూన్‌ 30 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఆ రాష్ట్రానికి చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బబుల్‌ గమ్‌లను నమలడం, ఉమ్మేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కరోనా రోగ లక్షణాలతో ఉన్నవారి నుంచి ఈ వ్యాధి మరొకరికి సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పాన్‌ మసాలా, గుట్కా, ఖర్రా వంటి ఉత్పత్తుల అమ్మకాలపై కూడా ప్రభుత్వం వచ్చే మూడు నెలలపాటు నిషేధం విధించింది.