శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:15 IST)

సీబీఎస్ఈలోనూ 'ఆల్ పాస్'

కరోనా కారణంగా విద్యార్థులెవ్వరూ నష్టపోకూడదని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని సీబీఎస్ఈని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డి) మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్ఈకి హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే పాఠశాలలో గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా 9, 11వ తరగతుల విద్యార్థులను సైతం ప్రమోట్‌ చేయాలని, పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను ప్రమోట్‌ చేయొద్దని సూచించింది.

29 ప్రధాన సబ్జెక్టులకే సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహిస్తుందని హెచ్‌ఆర్‌డి కేంద్ర మంత్రి రమేశ్‌ పోబ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. వర్సిటీ ప్రవేశాలు, ప్రమోషన్లకు అవసరమైన సబ్టెక్టులకే పరీక్షలు ఉంటాయని స్పష్టంచేశారు.