బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (18:43 IST)

పుట్టింటికి వెళ్ళిన భార్యను ఇంట్లోకి రానివ్వని భర్త.. ఎందుకు?

కరోనాను తరిమికొట్టేందుకు సామాజిక దూరం పాటించడం చాలా అవసరమైన నేపథ్యంలో.. ఓ వ్యక్తి పుట్టింటికి వెళ్లొచ్చిన భార్యను కూడా ఇంట్లోకి రానివ్వలేదు. ఈ ఘటన యూపీలోని బలియా జిల్లాలో వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే.. ఈ జిల్లాకు చెందిన బబితా, గణేశ్‌ ప్రసాద్‌కు ఐదేళ్ల క్రితం పళ్లైంది. బబిత రెండు నెలల క్రితం బీహార్‌లోని పుట్టింటికి వెళ్లింది.
 
అయితే బబిత బుధవారం బలియాలోని తన ఇంటికి రాగా.. గణేశ్‌ ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో బబిత చేసేదేమి లేక ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి షెల్టర్‌లో తలదాచుకుంది. ఇది కుటుంబానికి సంబంధించిందని, ఈ ఘటనపై సదరు భార్యాభర్తలతో మాట్లాడటం జరుగుతుందని సిటీ పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జి విపిన్‌ సింగ్‌ చెప్పారు.