కోవిడ్-19 సర్వే సిబ్బంది పై భౌతిక దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కే.ఎస్. జవహర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై కాంటాక్ట్ ట్రేసింగ్ సర్వే సమయంలో, రోగుల మృత దేహాల ఖననాల సందర్భముగా దహన...