1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Amaravati new map released as andhra pradesh capital

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి - కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన కేంద్రం

india map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొత్త మ్యాప్‌ను విడుదల చేశాయి. దేశ చరిత్రలోనే తొలిసారి ఒకరాష్ట్ర రాజధానిని ఖరారు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసిన విషయం తెల్సిందే. 
 
ఏపీ పునర్‌‍వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలుపడంతో అమరావతికి తిరుగులోని అధికారిక హోదా దక్కింది. 2024 జూన్ 2వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చేలా చట్టం చేయడం గమనార్హం. దీంతో గత కొన్నేళ్లుగా సాగుతున్న మూడు రాజధానుల గందరగోళానికి శాశ్వతంగా తెరపడింది. 
 
ఏపీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్‌లో మరో కీలక మార్పు చోటుచోసుకుంది. కొత్త మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్యం 28కి చేరింది. ఈ నూతన జిల్లాల సరిహద్దులతో కూడిన అధికారిక పటాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. 
 
కేంద్ర ప్రభుత్వం కూడా తన రికార్డులో భారత అధికారిక మ్యాప్‌‍లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్‌డేట్ చేసింది. ఇది దేశ వ్యాప్త పరిపాలన అవసరాలకు ప్రామాణికంగా నిలవనుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మహిళలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వకుంటే ఎలా? వెంకయ్య నాయడు