1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Anatapur DIG Ammireddy Transferred

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీవేటు

mukesh kumar meena
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికలు అప్పగించొద్దని ఉన్నతాధికారులను ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇటీవల అనంతంపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది. 
 
కాగా, ఇప్పటికే రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించిన విషయం తెల్సిందే. ఆయన స్థానంలో కొత్త డీజీపీని ఎన్నికల సంఘం నియమించనుంది. కాగా, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికార వైకాపాకు అంటకాగుతున్న పలువురు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లపై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపిస్తున్న విషయం తెల్సిందే. 
తర్వాతి కథనం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ!