సంబంధిత వార్తలు
- ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
- ఏపీలో రూపురేఖలు మారిపోనున్న రైల్వే స్టేషన్లు..
- ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్
- Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ
- పార్లమెంట్లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు
ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే జూలైలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో పూర్తి బడ్జెట్‌ను సమర్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఈ నెల 24న గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యకలాపాల్లో భాగంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
సమావేశానికి ముందు, సమావేశ ఏర్పాట్లను చర్చించడానికి చీఫ్ విప్ నేతృత్వంలో మంగళవారం ప్రభుత్వ విప్‌లతో సమావేశం జరగనుంది. 24న గవర్నర్ ప్రసంగం తర్వాత, సమావేశాల వ్యవధిని నిర్ణయించడానికి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి) సమావేశమవుతుంది. ఈ నెల 28న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
