1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra pradesh corona update

ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం.. కొత్తగా 1010 కేసులు

Andhra pradesh
ఏపీలో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1010 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,50, 324 కి పెరిగింది.
 
ఇక గడిచిన 24 గంటల వ్యవధి లో మరో 13 మంది చనిపోయారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 176 కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 58 , 054 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,82,93,704 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1149 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,24 , 645 లక్షలకు చేరింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఏపీ మంత్రులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు