కేంద్ర మంత్రి డ్యాన్స్‌కు ఫిదా అయిన ప్రధాని మోడీ
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు డ్యాన్స్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన... స్థానిక గ్రామస్థులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. ఆ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
కజలాంగ్ గ్రామానికి చెందిన సాజోలాంగ్ తెగ ప్రజలతో కలిసి మంత్రి రిజిజు డ్యాన్స్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో తెగలు ఇలా సాంప్రదాయ నృత్యాలను ఎంజాయ్ చేస్తుంటారని, వారితో కలిసి డ్యాన్స్ చేసినట్లు రిజిజు తెలిపారు.
మరోవైపు, రిజిజు డ్యాన్స్‌పై ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్ చేశారు. 'మా న్యాయశాఖ మంత్రి రిజిజు మంచి డ్యాన్సర్' అంటూ తన ట్విట్టర్‌లో మోడీ ఓ పోస్టు చేశారు. 'వైభవమైన అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిని చూడడం సంతోషం'గా ఉందని మోడీ అన్నారు.