1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra pradesh Inter first year classes starts from september 1st

ఏపీ విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ ఇంటర్ క్లాసులు

Andhra pradesh
ఏపీ విద్యార్థులకు ముఖ్య సూచన. ఇంటర్ ఫస్టియర్ క్లాసులకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి 2021-22 విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

ఈ విద్యా సంవత్సరం మొత్తం 188 పని దినాలు ఉంటాయని.. రెండో శనివారాల్లో కూడా కాలేజీలు కొనసాగుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. అలాగే ఈసారి టర్మ్ సెలవులు ఉండవని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2022వ సంవత్సరం ఏప్రిల్ 23 వరకు కళాశాలలు కొనసాగనున్నాయి. అలాగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నారు.
 
అటు ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అడ్వాన్స్‌డ్ సప్లిమెంతరీ ఎగ్జామ్స్‌ను మే చివరి వారంలో నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. కాగా, 2022-23 విద్యా సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రుసుం గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
చంద్రబాబుది ఎప్పుడూ యాంటీ మైనార్టీ స్టాండే: ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్