సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (16:54 IST)

ఏపీలో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీల ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలను ఎంసెట్ రూపంలో నిర్వహించేవారు. ఇపుడు దీని పేరు మార్చారు. ఏపీఈఏపీ సెట్‌గా మార్చుతూ చర్యలు తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించే ఏపీఈఏపీ సెట్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం కాకినాడ జేఎన్టీయూకి అప్పగించింది. ఆగస్టు 19 నుంచి ఏపీఈఏపీ సెట్ జరగనుంది. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష, సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష నిర్వహించనున్నారు. 
 
ఈ ఏడాది నిర్వహించే ఏపీఈఏపీ సెట్‌కు ఛైర్మన్‌గా కాకినాడ జేఎన్టీయూ వీసీ రామలింగరాజు వ్యవహరించనున్నారు. కాగా, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అభ్యర్థులకు కల్పించింది.