శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (18:59 IST)

ఏపీలో వెయ్యి లోపుకు చేరిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిలోపుకు చేరాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 46,962 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్‌ బారినపడిన వారిలో 1,543 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఏపీలో మొత్తం కరోనా కేసులు 19,94,606కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 19,63,728 మంది కోలుకున్నారు. మరో 17,218 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13660కి చేరాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.