ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (09:08 IST)

ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకు సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. కరోనా రెండో దశ అల మందగించడంతో పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 
 
అయితే, కరోనా నేపథ్యంలో తగు జాత్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. తరగతుల నిర్వహణపై ఇప్పటికే విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్థులు మించకుండా చర్యలు తీసుకోవాలంది. 
 
అలాగే, స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్‌వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలని ఆదేశించింది. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోగా.. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న పాఠశాలలు విద్యార్థులకు స్వాగత పలకనున్నాయి.