శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (14:50 IST)

ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం సెలవు ఎపుడు? క్లారిటీ ఇచ్చిన సీఎస్

ముస్లిం సోదరుల పవిత్ర పండుగల్లో ఒకటైన మొహర్రం పండుగ ఈ నెల 20వ తేదీన జరుపుకోనున్నారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక సెలవురోజుగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ప్రభుత్వ ఉత్తర్వుల జారీచేశారు. 
 
వాస్తవానికి ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 19వ తేదీ గురువారం మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినమైన్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ సెలవు దినాన్ని ఈనెల శుక్రవారానికి మార్పు చేసింది. దీంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొహర్రం సెలవు దినాన్ని గురువారానికి బదులుగా 20వతేదీ శుక్రవారానికి మార్పు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
ఈనెల 20వ తేదీ మొహర్రం పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, వివిధ స్థానిక సంస్థలకు ఈ సెలవు దినం వర్తిస్తుంది. అదేవిధంగా నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం వివిధ బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు మొదలైన వాటికి కూడా ఈ సెలవు దినం వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.