1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Pradesh Lockdown and Curfew end today

ఏపీలో ముగియనున్న లాక్డౌన్ ఆంక్షలు : నేడు సీఎం జగన్ నిర్ణయం!

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, కర్ఫ్యూ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ ఆంక్షలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ ఆంక్షల పొడిగింపుపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. 
 
మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన అనంతరం కోవిడ్‌పై సీఎం సమీక్షించనున్నారు. కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 
 
ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. అదే విధానాన్ని కొనసాగిస్తారా? లేక మరో గంట సమయం సడలింపు ఇస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వ్యాక్సిన్ విధానంపై కేంద్రానికి సుప్రీం ప్రశ్నల వర్షం...