1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP CM Chandra Babu Naidu Praises Temple Staffer For Feeding Differently Abled Devotee

చేతులు లేని దివ్యాంగుడికి అన్నం తినిపించిన ఉద్యోగి.. శభాష్ గాయత్రీ అంటూ సీఎం ప్రశంస (Video)

dwaraka temple employee
ఏపీలోని ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయ ఉద్యోగి గాయత్రీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఆమె చేసిన మెచ్చుకుంటూ శభాష్ గాయత్రీ.. మీ సహృదయానికి వందనాలు అంటూ స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్‌‍లో పోస్ట్ చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవారి దర్శనానికి భీమడోలు మండలం పాతూరు గ్రామానికి చెందిన దివ్యాంగ భక్తుడు వాడపల్లి రాంబాబు ఈ నెల 3వ తేదీన వచ్చి స్వామి దర్శనం తర్వాత భోజనం చేసేందుకు అన్నదాన సత్రంలోకి వెళ్లారు. 
 
అయితే, సిబ్బంది వడ్డించిన భోజనం చేసేందుకు ఇబ్బందిపడుతుండగా అక్కడ పని చేస్తున్న గాయత్రి అనే ఉద్యోగిని గమనించి, ఇస్తర్లో వడ్డించిన భోజనం కలిపి భక్తుడికి తినిపించి, ఆకలి తీర్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది ముఖ్యమంత్రి బాబు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్పందించారు. 'శభాష్ గాయత్రీ... చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం అంటూ ప్రశంసించారు.  
 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
October 07, 2026: బుధవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?