1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ap cm chandrababu comments on no trust motion

జగన్‌కు అంత సీన్ లేదు... చివరి అస్త్రంగా అవిశ్వాసం : చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర హక్కులను సాధించుకునేంత సీన్ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి లేదని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

chandrababu
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర హక్కులను సాధించుకునేంత సీన్ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి లేదని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేసులకు భయపడి కేంద్రానికి భజన చేస్తున్నారంటూ మండిపడ్డారు. అదేసమయంలో తాము ఎన్డీయే నుంచి వైదొలిగితే ఆయన అక్కడ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. 
 
మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ, ఎంపీలు తక్కువగా ఉన్న కారణంగా మనం అవిశ్వాస తీర్మానం పెట్టలేమ‌ని, అయితే, అవసరమైతే అన్ని పార్టీల సాయం తీసుకుని అవిశ్వాసం దిశగా వెళతాన‌ని అన్నారు. కానీ, అది చివరి ప్రయత్నంగా మాత్ర‌మే ప్రయోగించాలని చెప్పారు.
 
అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 54 మంది ఎంపీలు ఉండాలన్నారు. తాను అవిశ్వాస తీర్మానం వల్ల లాభం లేదని అన్నానని కొందరు అంటున్నారని, తాను అలా అనలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అన్ని పోరాటాలు చేసిన తరువాత ఆ ప్ర‌య‌త్నం చేయాల‌ని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తారో ప్యాకేజీ నిధులు ఇస్తారో కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలని అన్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పీకే చింపేశారు.. శభాష్ అంటూ మహేష్ కత్తి ప్రశంసలు