1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ap cm chandrababu fire on congress, dmk allinace

మహిళా బిల్లును తిరస్కరించి దక్షిణాదికి హాని చేసిన కాంగ్రెస్ - డీఎంకే : సీఎం చంద్రబాబు

chandrababu naidu
మహిళా బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్, డీఎంకేలు అడ్డుకుని దక్షిణ భారతదేశానికి తీరని నష్టం చేశాయని ఏపీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తమిళనాడు రాష్ట్ర శానసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం కోయంబత్తూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సత్ సంబంధాలు ఉన్నాయన్నారు. దీనికి నిదర్శనమే ఎంజీఆర్, ఎన్టీఆర్‌లు తెలుగు గంగా ప్రాజెక్టు అమల్లోకి తెచ్చి తమిళనాడు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీరుస్తున్నారన్నారు. 
 
ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు గంగ ద్వారా చెన్నైకు నీరిచ్చామని... నదుల అనుసంధానం జరిగితే... గోదావరి నీళ్లను తమిళనాడుకు ఇవ్వవొచ్చన్నారు. నదుల అనుసంధానానికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. తమ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి జరుగుతోందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ బిల్లును అడ్డుకుని డీఎంకే సహా ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలు తప్పు చేశాయని ఆయన తెలిపారు. 
 
కేంద్రం ప్రతిపాదించిన డిలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగిందని ఆయన చెప్పారు. డీఎంకే సహా ఇండి కూటమి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌లు చాలా దగ్గరి స్నేహితులని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారిద్దరూ కలిసి తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం నిర్వహించారు.
 
'ఇప్పటికీ చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో తమిళమే మాట్లాడతారు. నా వివాహం కూడా చెన్నైలోనే జరిగింది. నదుల అనుసంధానంతో దేశానికి నీటి భద్రత వస్తుంది. భవిష్యత్తులో అన్నీ కుదిరితే గోదావరి - కృష్ణ - కావేరి నదులు అనుసంధానం కావాలి. ప్రధాని నరేంద్ర మోడీ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. తమిళుల ప్రయోజనాలు పట్టని పార్టీలు మనకొద్దు. తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునేది.. ఎన్డీయే మాత్రమే' అని చంద్రబాబు అన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఉధంపూర్‌లో లోయలో పడిన బస్సు - 15 మంది మృత్యువాత