1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ap cm chandrababu naidu fire on ys jagan mohan reddy

ఓట్ల కోసం చనిపోయిన తండ్రికి పూజలు చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

chandrababu
గత వైకాపా పాలకులు చేసిన పాపాలు ఇపుడు ప్రజల పాలిట శాపాలుగా మారాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించిన ఆయన... రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేసినట్టు తెలిపారు. 
 
'ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండాలి. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత నాది. తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో 70 ఏళ్ల నాటి సమస్యలు పరిష్కరించాం. భూముల వివరాలన్నీ మీ సమక్షంలోనే పొందుపరుస్తున్నాం. దళారీ వ్యవస్థకు చోటు లేకుండా గ్రామసభల్లోనే పుస్తకాలిస్తున్నాం. 
 
ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా చేయాలన్నదే మా లక్ష్యం. 6,887 గ్రామాల్లో సర్వే చేశాం.. 29,04,000 పాస్‌ పుస్తకాలిచ్చాం. క్యూఆర్‌ కోడ్‌లో రికార్డులన్నీ స్పష్టంగా ఉంటాయి. డోన్‌లో ఎన్నో ఏళ్లుగా వక్ఫ్‌భూములు సాగు చేసుకుంటున్న 784 మంది రైతుల సమస్య పరిష్కరించాం. 
 
రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దు. కుల, మతాలను విభజించడానికి వీల్లేదు. రావణ్‌ అనే వ్యక్తి.. పురాణాలను దూషించాడు. రాముడు, సీతపై  నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని, పాకిస్థాన్‌ను సమర్థించాడు. ఇలాంటి వాళ్లకు గొడ్డలి పార్టీ ఆర్థికసాయం చేసింది. రాష్ట్రంలో వింత ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులున్నారు. ఆస్తి కోసం తల్లిని హింసిస్తున్నారు. ఓట్ల కోసం చనిపోయిన తండ్రికి పూజలు చేస్తున్నారు. 
 
తల్లిని గౌరవించలేని వ్యక్తి మనకు అవసరమా? తల్లులంటే గౌరవం ఉండాలనే.. తల్లికి వందనం తీసుకొచ్చా. గొడ్డలి పార్టీ.. విసుగు, విరామం లేకుండా కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. కులం, మతం, ప్రాంతాల వారీగా ముక్కలు చేసే కుట్రకు పాల్పడుతోంది. రాయలసీమలో ముఠాలు లేకుండా చేసింది టీడీపీనే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణగా ఉండాలి. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం మంచిదికాదు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరిరోజు అని మళ్లీ హెచ్చరిస్తున్నా' అని చంద్రబాబు అన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బీఆర్ఎస్‌ అవినీతి ద్వారా రూ. 1,400 కోట్లు కూడబెట్టింది.. కల్వకుంట్ల కవిత