1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP CM Chandrababu Naidu Sensational Comments on Centre

కేంద్ర మంత్రిపదవులు మనకక్కర్లేదు: నేతలతో చంద్రబాబు

అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న రెండు మంత్రి పదవులూ అక్కర్లేదని ఆయన స్పష్టంచేశారు.

Chandrababu Naidu
అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న రెండు మంత్రి పదవులూ అక్కర్లేదని ఆయన స్పష్టంచేశారు. కేంద్రం అన్యాయం చేస్తున్నా మంత్రి పదవుల్లో వేలాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఎంపీ మురళీమోహన్‌ అన్నప్పుడు సీఎం పై విధంగా స్పందించారు.
 
అసలు మనకెందుకా మంత్రి పదవులు? అవేమైనా ప్రధాన శాఖలా? వాటివల్ల ఏమొచ్చింది? వాటిని పట్టుకుని మనం వేలాడడమేంటి? అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు జోక్యం చేసుకుని, ఆదేశిస్తే తక్షణం రాజీనామా లేఖ సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. 
 
అంతేకాకుండా, పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే ఆర్థిక బిల్లులో నవ్యాంధ్రకు న్యాయం చేసే అంశాలేవీ లేకుంటే... ఏం చేయాలనే అంశంపై అప్పటికప్పుడు డైనమి‌క్‌గా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా చేయాల్సిన సాయంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని తీర్మానించింది. 'ఇది చివరి బడ్జెట్. ఇప్పుడు కూడా నిధులు కేటాయించకుండా, చేస్తాం, చూస్తాం అంటే నమ్మే పరిస్థితి లేదు అని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు : త్రిపురలో సీపీఎం కంచుకోట బద్ధలు