మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (22:14 IST)

సీఎం చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం... మంత్రి శ్రీనివాసులు శుభాకాంక్షలు

చంద్రబాబు నాయుడు రాజకీయ అరంగేట్రం చేసి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు రాష్ట్ర సమాచార శాఖామంత్రి కాలవ శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉండవల్లి సమీపంలో వున్న చంద్రబాబు నివాసంలో మంగళవార

చంద్రబాబు నాయుడు రాజకీయ అరంగేట్రం చేసి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు రాష్ట్ర సమాచార శాఖామంత్రి కాలవ శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉండవల్లి సమీపంలో వున్న చంద్రబాబు నివాసంలో మంగళవారం ఆయనను కలిశారు. 
 
ఈ సందర్భంగా పెన్సిల్‌తో గీచిన చంద్రబాబు నాయుడు చిత్ర పటాన్ని ముఖ్యమంత్రికి ఎం గ్రూపు ప్రతినిధులతో కలిసి మంత్రి కాలవ శ్రీనివాసులు అందజేశారు. భవిష్యత్తులోనూ రాజకీయాల్లో తమదైన శైలిలో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిపరంగా దేశంలోనే అగ్రగామిగా నిలవాలని మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు.