మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (08:51 IST)

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్... ఢిల్లీకి రమంటూ ఆహ్వానం

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. ఢిల్లీకి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని సూచించారు. దీనికి చంద్రబాబు ససేమిరా అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. ఢిల్లీకి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని సూచించారు. దీనికి చంద్రబాబు ససేమిరా అన్నారు. అవసరమైతే ముగ్గురు సభ్యుల బృందాన్ని హస్తినకు పంపిస్తామని చెప్పారు. దీంతో షా ఫోన్ పెట్టేసినట్టు సమాచారం. 
 
సోమవారం నుంచి బడ్జెట్ మలిదశ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈనేపథ్యంలో ఏపీకి సాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిన పక్షంలో రాజీనామాలకు సిద్ధమని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ కూడా దూరమవుతుందన్న బీజేపీ భావిస్తోంది. 
 
ఈనేపథ్యంలో చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసి, చర్చిద్దాం రమ్మని ఆహ్వానం పలికారు. ఐదో తేదీన ఢిల్లీకి వస్తే కలిసి మాట్లాడుకుందామని సూచించారు. చర్చలకు సమ్మతించిన చంద్రబాబునాయుడు తాను రానని స్పష్టంగా తేల్చిచెప్పారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులను పంపిస్తానని, వారితో మాట్లాడాలని ఆయన తెలిపారు. దీంతో షా ఖంగుతిని ఫోన్ పెట్టేశారని చెప్పారు.