సంబంధిత వార్తలు
- సినిమా వాళ్ళతో జగనన్నకు ఏం పని? కేతిరెడ్డి వైరల్ Video
- ఇంకా నయం... సీఎం సీటు ఇవ్వాలని అడగలేదు.. ఛీ.. చివరకు వీళ్లతో కూడా (Video)
- జగన్మోహన్పై తిరగబడిన వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి (video)
- వైకాపాలో వైఎస్సార్ లేరు.. ఆ ముగ్గురే వున్నారు.. షర్మిల సెటైర్లు
- జగన్కు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది.. అద్దంలో చూసిన ఆయన ముఖమే: షర్మిల
వైఎస్ జగన్‌ను మాస్ ర్యాగింగ్ చేస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఆయన దిగిపోయేంతవరకు ప్రభుత్వ ఉద్యోగులతో ఓ ఆట ఆడుకున్నారు. నానా విధాలుగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల్లో ఒకటి.. నెల జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం. ఒక వేళ ఇచ్చినా వాయిదాల రూపంలో ఇవ్వడం. ఇలా గత ఐదేళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగాలు నెల జీతం ఎపుడు వస్తుందోనంటూ ఎదురు చూపులు చూశారు.
అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు జగన్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పించారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, ఉప ముఖ్యమంత్రిగా సినీ హీరో పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. పైగా, టీడీపీ - జనసేన - బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు సామాజిక పింఛన్లతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో ఉదయానికల్లా వేతనాలు బ్యాంకు ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటూ, జగనన్నను వీడియోలతో మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల రాగింగ్ ???? ????
— ???????? సుజత్ ????️✝️☪️ (@Kadirodu) August 1, 2024
గడచిన 5 ఏళ్లలో ఏ ఒక్క ఉద్యోగి అయిన ఇలా ఒకటో తారీఖునే జీతాలు పడ్డాయని చెప్పాడా??.. pic.twitter.com/G5vZpQXvIK
తర్వాతి కథనం
