బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్

దివ్యాంగులను కింపచరిచిన స్మితను తొలగించాల్సిందే : హైదరాబాద్‌లో నిరసన

smitha sabarwal
దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను విధుల నుంచి తొలగించాలంటూ దివ్యాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఇదే అంశాన్ని డిమాండ్ చేస్తూ వారు హైదరాబాద్ నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిసారించి స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 
 
విద్య, ఉపాధి అవకాశాల్లో దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఎందుకు అంటూ ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశంపై ఐక్య వేదిక నేత నాగేశ్వర రావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు.