బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జులై 2024 (20:27 IST)

సినిమా వాళ్ళతో జగనన్నకు ఏం పని? కేతిరెడ్డి వైరల్ Video

ketiredy
సినిమా వాళ్ళతో జగనన్నకు ఏం పని? అంటూ వైకాపాకు చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమికి జగన్మోహన్ రెడ్డి వైఖరే అంటూ ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటివారిలో కేతిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. సినిమా వాళ్లతో జగనన్నకు ఏం పని అంటూ ప్రశ్నించారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించడం వల్ల మనకు నిస్టూరం తప్ప ఏం మిగిలలేదన్నారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటే.. ఓసీలు వద్దా అంటూ ఆయన ప్రశ్నించారు. లేనిపోని విషయాల్లో తలదూర్చడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.