బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జులై 2024 (20:15 IST)

ఇంకా నయం... సీఎం సీటు ఇవ్వాలని అడగలేదు.. ఛీ.. చివరకు వీళ్లతో కూడా (Video)

swathi naidu
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సినీ నటి స్వాతి నాయుడు, ఆమె బంధువులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. 11 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఇంకా నయం.. తనకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ముఖ్యమంత్రి సీటు ఇవ్వాలని మాత్రం అడగలేదు అంటూ వారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పైగా, ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటా స్పీకర్‌ను డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారన్నారు. గతంలో ఎవరు కూడా జగన్ తరహాలో ఘోరంగా ఓడిపోయిన దాఖలాలు లేవన్నారు. జగన్ పాలనకు ఆయన తండ్రి వైఎస్ఆర్ పాలనకు ఏంతో తేడా ఉందని, అందుకే జగన్‌ను చిత్తుగా ఓడించారని వ్యాఖ్యానించారు.