ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జులై 2024 (14:42 IST)

జగన్మోహన్‌పై తిరగబడిన వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి (video)

ketiredy
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రెడ్డి తిరగబడ్డారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులు మాత్రమే అయిందని గుర్తు చేశారు. ఈలోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ గగ్గోలు పెట్టడం ఎంత వరకు సమంజశమని ఆయన ప్రశ్నారు. 
 
పైగా, సంపద సృష్టించిన తర్వాతే హామీలు నెరవేర్చుతామంటూ చంద్రబాబు పదేపదే చెప్పారని, అలాంటపుడు సంపద సృష్టించేందుకు సమయం ఇవ్వాలి కదా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం ఒక యేడాది పాటు సమయం ఇచ్చి ఆ తర్వాత వారిని నిలదీస్తే బాగుంటుందని హితవు పలికారు. 
 
ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. "మనం మొత్తం అప్పులు చేసి ఒక్క ఏడాది టైం కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద పడితే ఎలా!?? వాళ్ళకి సంపద సృష్టికి టైం ఇవ్వాలి కదా!?? ఒక్క ఏడాది కూడా ఆగలేరా!?? ఇదేమి రాజకీయం అంటూ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.