బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జులై 2024 (12:20 IST)

యువతిపై అత్యాచారం చేసిన బాల్య స్నేహితుడు - కామన్ ఫ్రెండ్.. ఎక్కడ?

rape demo
హైదరాబాద్ నగరంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా ఆ యువతి బాల్య స్నేహితుడుతో పాటు కామన్ ఫ్రెండ్ కావడం గమనారం. యువతికి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ విషయాన్ని తన బాల్య స్నేహితుడికి చెప్పి, సెలెబ్రేట్ చేసుకునేందుకు పిలిచింది. ఆ బాల్య స్నేహితుడు తమ కామన్ ఫ్రెండ్‌తో కలిసి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు 
 
ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం పొందిన యువతి సెలబ్రేట్ చేసుకుందామని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని, మరో కామన్ ఫ్రెండ్‌ను పార్టీకి ఆహ్వానించింది. వారు ముగ్గురూ సోమవారం సాయంత్రం వనస్థలిపురంలో ఓ హోటల్‌కు అనుబంధంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. గౌతమ్ రెడ్డి, మరో కామన్ ఫ్రెండ్ బాగా తాగి, ఆ యువతిని హోటల్‌లోని రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు. 
 
దాంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వనస్థలిపురం పోలీస్ ఇన్‌స్పెక్టర్ జలేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆ యువతి, గౌతమ్ రెడ్డి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.