గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జులై 2024 (10:06 IST)

ఇంటి టెర్రస్‌పై దూసుకెళ్లిన బుల్లెట్.. మహిళకు గాయం

gunshot
హైదరాబాద్‌లోని నార్సింగి ప్రాంతంలో మంగళవారం తన ఇంటి టెర్రస్‌పై బుల్లెట్ దూసుకెళ్లడంతో ఒక మహిళ గాయపడినట్లు అధికారులు తెలిపారు. సైనికులు ప్రాక్టీస్ చేస్తున్న సమీపంలోని ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి అది మిస్ ఫైర్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పద్మ అనే మహిళ గంధంగూడలోని తన భవనం టెర్రస్‌పై ఉండగా, ఆమె కాలికి బుల్లెట్ తగిలి చీలమండ దగ్గర బుల్లెట్ గాయమైంది.
 
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నార్సింగిలో ఈ నెలలో ఇది రెండో ఘటన. జూన్ 13న, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఐదవ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లోని అద్దాల కిటికీల నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. 
 
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. గంధంగూడ సమీపంలో రెండు ఫైరింగ్ రేంజ్‌లు ఉన్నాయి, ఇక్కడ పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు.