శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 జులై 2024 (21:13 IST)

హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్‌లో భారీగా నకిలీ పురుగుమందుల స్వాధీనం

crop
వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్న నకిలీ పురుగుమందుల విక్రేతల ఆటకట్టిసూ పోలీసులు జరిపిన దాడులలో పేరొందిన కంపెనీల ఉత్పత్తులు బయటపడ్డాయి. మోసపూరిత కార్యకలాపాలను అణిచివేసే ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లో ఇటీవల జరిపిన దాడిలో ఎనిమిది బహుళజాతి సంస్థలు (MNCలు), ప్రఖ్యాత భారతీయ కంపెనీలైనటువంటి ధనుక, సింజెంటా, ఎఫ్ఎంసి, కోర్టవా, ర్యాలీస్, ఇండోఫిల్, పై మరియు బేయర్ వంటి సంస్థల నకిలీ ఉత్పత్తులు ఉన్నట్లు వెల్లడైంది.
 
నకిలీ వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయడానికి పెద్దఎత్తున ఏర్పడ్డ ముఠాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ దాడి జరిగింది. ఈ నకిలీ వస్తువులు పంటల నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా దేశవ్యాప్తంగా రైతుల జీవనోపాధికి ముప్పు తెస్తాయి. వ్యవసాయం, వినియోగదారుల రక్షణ మరియు జాతీయ ప్రయోజనాలపై ఈ నకిలీ పురుగుమందులు చూపే ప్రభావం పరిగణలోకి తీసుకుంటే ఈ ఆపరేషన్ స్థాయి ఆందోళనకరంగా ఉంది.
 
ఇటువంటి నకిలీ రాకెట్‌లకు వ్యతిరేకంగా చురుకుగా సమాచారాన్ని సేకరిస్తున్న మరియు స్థానిక అధికారులతో సన్నిహితంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ కన్సల్టెంట్ శ్రీ ప్రదీప్ శర్మ ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను అందించారు.