హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. నోరో వైరస్ లక్షణాలివే.. అలెర్ట్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించిన నేపథ్యంలో.. తాజాగా నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఎక్స్ వేదికగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ హెచ్చరించింది.
ప్రస్తుతం నోరో వైరస్ కేసులు నగరంలోని యాకుత్‌పురా, మలక్ పేట, డబీర్‌పురా, పురానాహవేలీ, మొఘల్‌పురలతో పాటు పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. నోరో వైరస్ బారిన పడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే సింటమ్స్ కనిపిస్తాయి. ఇది అంటువ్యాధి.. అందుకే అప్రమత్తత అవసరం. షుగర్ ఉన్నవారు త్వరగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి.
ఇంటిని, పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి.
చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.