ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జులై 2024 (08:21 IST)

హాస్టల్‌లో గొడవ.. కత్తి దాడి.. రూమ్‌మేట్‌ను హత్య చేశాడు..

crime scene
హైదరాబాదులో నేరాల సంఖ్య తగ్గేలా కనిపించట్లేదు. శనివారం అర్థరాత్రి ఎస్‌ఆర్‌ నగర్‌లోని హాస్టల్‌లో ఓ వ్యక్తిని అతని రూమ్‌మేట్‌ హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన బాధితుడు వెంకట్ రమణ, ఎస్‌ఆర్‌నగర్‌లోని హనుమాన్‌ హాస్టల్‌లో ఉంటూ ఓ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు.
 
శనివారం రాత్రి అదే భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బార్బర్‌ షాప్‌ నిర్వహిస్తున్న వెంకట్‌ రూమ్‌మేట్‌ గణేష్‌ గదికి వచ్చి వెంకట్‌తో ఏదో విషయంపై వాగ్వాదానికి దిగాడు.
 
ఈ గొడవలో గణేష్ తన వద్ద ఉన్న కత్తిని తీసుకుని బాధితుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావానికి గురైన వెంకట్ మృతి చెందాడని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
 
సమాచారం మేరకు, ఎస్.ఆర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.