ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్

01-08-2004 నుంచి 31-08-2024 వరకు మీ మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ప్రథమార్ధం అనుకూలం. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాలి. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. దంపతుల మధ్య తరచు కలహాలు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణల అనుకూలించవు. ఆరోగ్యం సంతృప్తికరం. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సర్వత్రా ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ధనలాభం, వస్తుప్రాప్తి ఉన్నాయి. ఖరీదైన కానుకలు అందుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. గృహమార్పు యత్నాలు సాగిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి సలహా పాటించండి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఆలయాలకు విరాళాలందిస్తారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆప్తులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఉపాధ్యాయులకు పనిభారం. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు మెరుగుపడతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. తరచూ సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. సంస్థల స్థాపనలకు తగిన సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. పట్టుదలతో శ్రమించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ధనవ్యయంలో జాగ్రత్త. అవసరాలు వాయిదా వేసుకుంటారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటుతనం వల్ల నష్టాలు తప్పవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, స్థానచలనం. ఉపాధ్యాయుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే తరుణం. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. ఆదాయం సంతృప్తికరం. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
సర్వత్రా అనుకూలదాయకం. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. సమర్ధతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. నూతన వ్యాపారాలపై దృష్టి సారిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ఉన్నతాధికారులకు కష్టసమయం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ప్రధానం. 
 
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం అనుకూలదాయకం. ప్రతికూలతలను అధిగమిస్తారు. ఆర్ధికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు చేరువవుతారు. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను సన్నిహితుల ద్వారా తెలియజేయండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం దూకుడు కట్టడి చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు.
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్ధికలావాదేవీలతో సతమతమవుతారు. రుణఒత్తిళ్లతో మనశ్శాంతి లోపిస్తుంది. ఊహించని ఖర్చులు, ధరలు అందోళన కలిగిస్తాయి. గృహమార్పు ఫలితం నిదానంగా కలిసివస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఇతరులు విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాలు చేపడతారు. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. సంప్రదింపులు ముందుకు సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. యత్నాలు విరమించుకోవద్దు. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితులతో సంభాషణ ఊరట కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉన్నతాధికారులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. చేపట్టిన ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. కార్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. కష్టానికి తగిన ప్రతిఫలం నిదానంగా అందుతుంది. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది.