బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 27 జులై 2024 (19:56 IST)

28-07-2024 నుంచి 03-08-2024 వరకు మీ వార రాశిఫలితాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. సంకల్పబలంతో లక్ష్యం సాధిస్తారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీ సాయంతో ఒకరికి ప్రయోజనం కలుగుతుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. గృహమరమ్మ తులు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ వారం ఆశాజనకం. ఆదాయం బాగుంటుంది. రుణబాధల నుంచి విముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మనస్సులోని ఆందోళన తగ్గుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. వాదోపడాదాలకు దిగవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. వివాహయత్నాలకు శ్రీకారంచుడతారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులను మన్ననలు అందుకుంటారు. ఉపాధ్యాయుల స్థానచలన యత్నం ఫలిస్తుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. కార్యానుకూలత, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. పనులు సానుకూలమవుతాయి. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పత్రాల్లో సవరణలు అనివార్యం. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వేడుకకు హజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సమస్యలు సద్దుమణుగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. దంపతుల మధ్య అన్యోన్య నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. సోమవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. పాతమిత్రులు తారసపడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. న్యాయసంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికస్థితి నిరాశాజనకం. రుణసమస్యలు వెంటాడుతుంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. ఆప్తుల హితవు మీపై సత్ ప్రభావం చూపుతుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. గురు, శుక్రవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు అంకితభావం ప్రధానం. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. ఆర్థిక ఇబ్బందులెదుర్కుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానానికి మంచి జరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులు కలిసిరావవు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు.
 
తుల : చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
సర్వత్రా అనుకూలమే. మీ అభిప్రాయాలకు చక్కని స్పందన లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఆది. సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా మెలగండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో కూడిన స్థానచలనం. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. సమర్ధతను చాటుకుంటారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ చిన్నచూపు చూడొద్దు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు ఆందోళనకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం ఉపాధ్యాయులకు స్థానచలం ఇబ్బంది కలిగిస్తుంది. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పనులు సకాలం పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గురువారం నాడు అవగాహన లేని విషయోల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మొండిధైర్యంతో యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగాల్లో ఏకాగ్రత వహించండి. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనుకూలతలు అంతంత మాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. శ్రమించినా ఫలితం ఉండదు ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేస్తారు. రుణ ఒత్తిళ్లు పెరగకుండా చూసుకోండి. సన్నిహితుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహమార్పు అనివార్యం. విలువై వస్తువులు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాధ్యాయులకు స్థానచలనం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో స్థిచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. పెద్దల సలహా పాటించండి. వివాహయత్నం ఫలిస్తుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. నిర్మాణాలు వేగవంతమవుతాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. మరింత ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయులో సంభాషిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు.