గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-07-2024 శుక్రవారం దినఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి....

astro10
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ ఐ॥ పంచమి ఉ.5.56 షష్ఠి తె.3.29 ఉత్తరాభాద్ర రా.7.05 ఉ.వ.5.41 ల 7.10. ఉ.దు. 8. 09 ల 9.01 ప.దు. 12.30 ల 1.22.
 
మేషం :- పుణ్యక్షేత్రాల దర్శనంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతోమితంగా సంభాషించండి. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లోవారికి ఆందోళన తప్పదు. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. 
 
వృషభం :- వృత్తి వ్యాపారులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ మాటలకు సంఘంలో గౌరవం లభిస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రైవేటు సంస్థలవారు మార్పులకై చేయుప్రయత్నాలలో జయం చేకూరుతుంది. కొందరి ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారి తీస్తాయి.
 
మిథునం :- సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. భార్యా భర్తలు, ప్రేమికులు సంతోషంగా, ఉల్లాసంగా గడపటానికి తగిన సమయం. వివాదాలు చుట్టుముడతాయి. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. రుణయత్నాలలో కూడా స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు.
 
కర్కాటకం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. కార్యసాధనలో ఎవరి సహాయం మీకు లభించదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. స్త్రీలకు ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
 
సింహం :- అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకండి. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. వ్యాపారాలకు కావలసిన రుణం మంజూరవుతుంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు విజయాన్ని పొందుతారు. గతంలో చేసిన పనులకు ఇప్పుడు ఫలితాలు కలుగుతాయి.
 
కన్య :- ప్రియతములతో ప్రయాణాలకు ఏర్పాటుచేసుకుంటారు. ఇంటి కోసం విలువైన ఫరీచర్ సమకూర్చుకుంటారు. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయాల్లో ఏకాగ్రత, పునరాలోచన ముఖ్యం. హోటల్, రవాణా, స్వయం ఉపాధి, వైద్య రంగాల వారికి శుభప్రదం.
 
తుల :- వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. చేపట్టినపనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. పెట్టుబడులు పొదుపు పథకాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు వాయిదా పడుట మంచిది. కుటుంబ విషయాలు ఆవేదన కలిగిస్తాయి.
 
వృశ్చికం :- ఆర్థిక సంస్థలతో లావాదేవీలు అనుకూలిస్తాయి. విదేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో చికాకులు తప్పవు. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడివల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బ్యాంకులు, ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు.
 
ధనస్సు :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మాట్లాడలేని చోట మౌనం వహించడంమంచిది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు.
 
మకరం :- దూరప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులతో అనుకోని బంధం బలపడుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సన్నిహితులతో ఉన్న మనస్పర్ధలను తొలగించుకోవడానికి ఇది తగిన సమయం.
 
కుంభం :- సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. విందులు, వినోదాలు, దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఫలించక పోవచ్చును అందువల్ల మీరు ఆందోళన పడవలసిన అవసరంలేదు.
 
మీనం :- స్త్రీలు అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త వహించండి. రాజకీయ నాయకులు విదేశీపర్యటనలు చేస్తారు. ఆప్తులు, స్నేహితుల సహకారాన్ని కోరటానికి వెనుకాడవద్దు. దూరపు బంధువుల ప్రోత్సాహంతో పనులలో పురోభివృద్ధిని సాధిస్తారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.