గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-07-2024 సోమవారం రాశిఫలాలు - దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి...

astro5
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ బ|| పాఢ్యమి ప.2.41 శ్రవణం రా.12.58 ఉ.వ.5.43 ల 7.16 తె.వ.4.46 ల, ప. దు. 12.29 ల 1.21 పు.దు.3.05 ల 3.57.
 
మేషం :- కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తారు. వాహనచోదకులకు ఏకాగ్రత అవసరం. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
వృషభం :- దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి, ఆందోళనలు తప్పదు. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళుకువ వహించండి. దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి.
 
మిథునం :- రాజకీయనాయకులకు వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇరుగు పొరుగు వారి మధ్య కలహాలు అధికమవుతాయి. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. అపరాలు, ధాన్య స్టాకిస్టులకు జాగ్రత్త అవసరం. సేవా సంస్థలకు విరాళాలివ్వటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
కర్కాటకం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఆహార వ్యవహారాల్లో మెళుకువ వహించండి. దూరపు బంధువుల ప్రోత్సాహంతో పనులలో పురోభివృద్ధిని సాధిస్తారు. మీ వాహనం ఇతరులకుఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, సహనం ఎంతో ముఖ్యం.
 
సింహం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. వృత్తులలో వారికి చికాకులు, డాక్టర్లకు లాభదాయకం, ఆడిటర్లకు మిశ్రమ ఫలితం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
కన్య :- స్త్రీలకు షాపింగ్ విషయాలలో అప్రమత్తత అవసరం. ఎలక్ట్రానికల్, వైజ్ఞానిక, శాస్త్ర, కంప్యూటర్, టెక్నికల్ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. కొన్ని సమస్యలు పరిష్కరించలేనంత జఠిలమై చికాకు పుట్టిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
తుల :- విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. అపరాలు, ధాన్యం వాణిజ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత అవసరం.
 
వృశ్చికం :- మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. పాత వస్తువులను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంట్లో, వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. అటోమోబైల్ రంగాలలో వారికి మంచి మంచి అవకాశాలు లభించి పనిభారం అధికమవుతుంది.
 
ధనస్సు :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సాంఘిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు.
 
మకరం :- గణిత, సైన్సు, సాంకేతిక పరిశోధకులకు, అంతరిక్ష రంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి మీకు సహాయాన్ని అందిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యుల సమాచారం అందుతుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు.
 
కుంభం :- నిత్యావసర సరుకుల స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. మీకు, బంధువులకు మధ్య తలెత్తిన కలతలన్నీ దూరమై అంతా కలిసిపోతారు. విద్యార్థులు పెద్దల పట్ల, ప్రముఖుల పట్ల విముఖంగా వ్యవహారించడం వల్ల మాటపడక తప్పదు. గృహాలంకారణకు అవసరమైన నిధులు సమకూర్చుకొంటారు.
 
మీనం :- ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలోని పనులు మందకొడిగా సాగుతాయి. వైద్యులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.