గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-07-2024 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. మౌనమే శ్రీరామరక్ష

Astrology
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ పూర్ణిమ సా.4.12 ఉత్తరాషాఢ రా.1.52 ఉ.వ.10.13 ల 11.47. సా.దు. 4.50ల 5.42.
 
మేషం:- మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీరు పరోక్షంగా చేసే కార్యక్రమాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. క్రీడా కారులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. కీలకమైనవ్యవహరాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 
 
వృషభం :- ప్రముఖులను బహుమతులు అందజేస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విద్య సాంఘిక, సాంస్కతిక రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పెంపుడు జంతువుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మిథునం:- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. మీ కళత్ర, మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కర్కాటకం:- ముఖ్యుల రాకపోకలుకూడా లభిస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విశ్రాంతి చేయు యత్నాలు అనుకూలిస్తాయి.
 
సింహం:- ఆత్మీయులకు, చిన్నారులకు విలువైనకానుక లందిస్తారు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒకింత అసహనానికి గురవుతారు. వ్యాపారాల్లో పోటీ తత్వం ఆందోళన కలిగిస్తుంది. కానివేళలో ఇతరులు రాక ఇబ్బంది కలిగిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గ్రహించండి.
 
కన్య: - రచయితలు, పత్రికా, మీడియా రంగాలవారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు వివాదస్పదమైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సోదరీ, సోదరులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి.
 
తుల: బంధు మిత్రుల గురించి మంచి మంచి పథకాలు వేస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం:- మీరు హాస్యానికి చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదమవుతాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దైవం మీద చేసే పని మీద ధ్యాస, ధ్యేయం, ఏకాగ్రత వహించండి.
 
ధనస్సు:- వ్యాపార, వ్యవహారాల్లో ఖచ్చితంగా మెలగండి. ఫ్యాన్సీ, కిరాణా, మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు అభివృద్ధి కానవస్తుంది. మీరు ఉద్ధేశ్య పూర్వకంగా ఎవరినీ దూషించకపోయినా ఎదుటివారి అపోహలకు లోనైయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం.
 
మకరం: దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. మీ వ్యవహార జ్ఞానం, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులను విమర్శించడం మంచిదికాదని గమనించండి. రుణ, విదేశీయాన యత్నాల్లో ఆటంకాలెదుర్కుంటారు.
 
కుంభం : ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. సినిమా, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. పెద్దమొత్తలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
మీనం:- మీ సంతానం వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఏ విషయాన్ని తెగేవరకూ లాగటం మంచిదికాదు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. మీ ఉన్నత స్థితిని చూసి ఓర్వలేనివారు అధికమవుతున్నారు అని గమనించండి. కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగాలలో వారికి పనివారితో సమస్యలు తలెత్తగలవు.