బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-07-2024 శుక్రవారం రాశిఫలాలు - వ్యాపారా లావాదేవీలు ప్రోత్సహకరంగా ఉంటాయి....

astro4
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ త్రయోదశి సా.6.01 మూల రా.2.31 ఉ.వ. 10.16 ల 11.54 రా.వ.12.53 ల 2.31. ఉ.దు. 8.09 ల 9.01 ప. దు. 12.30 ల 1.22.
 
మేషం :- ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దైవ పుణ్యకార్యక్రామాలలో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. అపరాలు, ధాన్య స్టాకిస్టులకు మెలకువ అవసరం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు.
 
వృషభం :- సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. మీ ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. 
 
మిథునం :- గృహోపకరణాలు అమర్చుకుంటారు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. సమయానికి కావలసిన వస్తువులు కనిపిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల కలయిక సాధ్యం కాదు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు.
 
కర్కాటకం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. రుణవిముక్తులు కావడంతోపాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ వహించండి. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
సింహం : ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీ మాటతీరు పద్ధతి మార్చుకోవలసి ఉంటుంది. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ముందుచూపుతో వ్యవహరించడం చాలా మంచిది. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం మీకు ఆందోళన కలిగిస్తుంది.
 
కన్య :- గృహరుణాలు అడ్వాన్సులు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
తుల :- ఆర్థికపరమైన సమావేశాలు సత్ఫలితాలిస్తాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఖర్చులు పెరగటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాల వల్ల లబ్ది పొందుతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
వృశ్చికం :- మీ కళత్ర వైఖరి మీకు చికాకులను కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తి కరంగా సాగుతాయి. మీ చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. ప్రముఖుల కోసం షాపింగులను చేస్తారు.
 
ధనస్సు :- వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ప్రతిష్ఠలకు కొంత విఘాతం కలిగే అవకాశం ఉంది. కుంటుంబంలోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సంఘంలో గుర్తింపు, రాణింపు పొందుతారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు వాయిదాపడుట మంచిది.
 
మకరం :- శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ఇంటర్వ్యూలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకొలేకపోతారు. సృజనాత్మకంగా వ్యవహరించినప్పుడు మాత్రమే లక్ష్య సాధన వీలవుతుందిని గ్రహించండి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. 
 
కుంభం :- రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యుల గురించి తప్పుడు వార్తలు వినవలసివస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. వ్యాపారా లావాదేవీలు ప్రోత్సహకరంగా ఉంటాయి.
 
మీనం :- మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ఊహించని ఖర్చులు వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ కున్న దానితో సంతృప్తి చెందండి. బ్యాంకింగ్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు స్థిరాస్తి అమర్చుకోవాలి అనే కొరిక స్ఫురిస్తుంది.