గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-07-2024 మంగళవారం రాశిఫలాలు - స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించాలి...

astro6
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ ఐ॥ విదియ ప.12.51 ధనిష్ఠ రా.11.46 ఉ.శే.వ.6.17 కు. ఉ.దు. 8.09 ల 9.01 రా.దు. 10.57 ల 11.41.
 
మేషం :- కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. విందు, వినోద కార్యక్రమాల పట్ల పెద్దలు, పిల్లలు ఆసక్తితో పాల్గొంటారు. పూలు, పండ్లు, కొబ్బరి కాయల వ్యాపారులకు లభదాయకంగా ఉంటుంది. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి.
 
వృషభం :- స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ప్రేమికుల మధ్య కొత్త కొత్తఆలోచనలు స్ఫురిస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు సజావుగా సాగవు. సన్నిహితులు నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటుంది.
 
మిథునం :- ఫ్యాన్సీ, కిళ్ళీ, కిరాణా రంగాలలో వారికి, చిరువ్యాపారులకు అనుకూలం. పాతసమస్యల నుండి బయటపడతారు. మీ సంతానం కోసం ఖర్చుచేస్తారు. వాహనం నడుపుతున్నపుడు మెళుకువ వహించండి. ఇతర విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగును. మీ శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది.
 
కర్కాటకం :- వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. ఉద్యోగులకు సంబంధించిన సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
సింహం :- ఉద్యోగస్తులు అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. బంధువులను కలుసుకుంటారు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. దైవ, పుణ్య కార్యక్రామాలలో పాల్గొంటారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి.
 
కన్య :- ఆర్థిక లావాదేవీలు ఊహించని విధంగా ఉంటాయి. భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రతికూలతను సైతం అనుకూలం. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
 
తుల :- కాంట్రాక్టులు. అగ్రిమెంట్లు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకర సమయం. చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు మీ సహాయం ఆర్థిస్తారు. అవివాహాతులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
 
వృశ్చికం :- వ్యాపారంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఆనందం నెలకొంటుంది. ఇంటా బయటా మీదే పైచేయి. పనులను సాఫీగా పూర్తి చేస్తారు. పనులను నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- సన్నిహితుల ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అప్రమత్తత అవసరం. చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి.
 
మకరం :- వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయాజనాలు సాధించడం కష్టసాధ్యం. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు అనుకూలం. గృహోపకరణాలకు కావలసిన వస్తుంవులను కొనుగోలు చేస్తారు. అనుకోని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్యనుంచి గట్టెక్కుతారు.
 
కుంభం :- ఆర్థిక వ్యవహరాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. సహోద్యోగులతో వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. పై అధికారుల సహకారం లోపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
 
మీనం :- వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సమయానికి మిత్రులు సహకరించక పోవటంతో అసహనానికి గురవుతారు. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు.