ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జులై 2024 (20:26 IST)

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రాజ్ తరుణ్.. కుమారీ ఆంటీ, బర్రెలక్క?

Bigg Boss 8
Bigg Boss 8
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కన్ఫర్మ్ అయి అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రియతమ హోస్ట్ అక్కినేని నాగార్జున మళ్లీ రానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్‌ను నిర్మిస్తున్నారు. ప్రభాస్ శ్రీను, గాయత్రి గుప్తా, రాజ్ తరుణ్, యాంకర్ వింధ్యతో సహా కొత్త పోటీదారులను ప్రకటించారు. 
 
యాంకర్ రితూ చౌదరి, కమెడియన్ యాదమ్మ రాజు, సెలెబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి, కుమారీ, యూట్యూబర్లు నిఖిల్, బంచిక్ బబ్లూ, నేత్ర, కుమారి ఆంటీ, బర్రెలక్క పేర్లు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ తేదీని ఓ గ్రాండ్ ఈవెంట్ ద్వారా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 
 
గత బిగ్‍బాస్ 7వ సీజన్‍లో రైతుబిడ్డ అంటూ కామన్ మ్యాన్‍గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. టైటిల్ దక్కించుకున్నాడు. టీవీ యాక్టర్ అమర్ దీప్ చౌదరి రన్నరప్ అయ్యాడు.