శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (19:00 IST)

బర్రెలక్కపై జగన్ కామెంట్లు.. జనసేన సూపర్ కౌంటర్

janasenaparty flag
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నోటి నుంచి వచ్చిన పంచ్‌పై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. అతని మాటలకు ధీటుగా స్పందిస్తూ.. కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
 
శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన సభలో జగన్‌, జనసేన, అధినేత పవన్‌ విమర్శలు గుప్పించారు. ప్యాకేజ్ స్టార్ అంటూ తరచూ పంచ్‌లు విసురుకునే ఆయన తాజాగా మ్యారేజ్ స్టార్ అనే కొత్త పదాన్ని జోడించారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన స్పందించింది.
 
2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జగన్ పార్టీకి వచ్చిన ఓట్ల సంగతేంటి? ప్రశ్నించడమే కాదు.. ఆధారాలు చూపుతూ ఎదురుదాడికి దిగారు. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 56 స్థానాల్లో వైసీపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని జనసేన దృష్టికి తెచ్చింది. అంతేకాదు.. అ బర్రెలక్క పేరుతో పంచ్ వేసిన జగన్‌పై విమర్శల దాడి జరిగింది.
 
 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే దమ్ము బర్రెలక్కకు ఉందని, తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్, వైసీపీలకు లేదని అన్నారు. తాజా వ్యాఖ్యలతో జగనే అదే మాట చెప్పారని మండిపడ్డారు. అంతేకాదు.. సెల్ఫ్ గోల్ చేయడంలో జగన్‌ను మించిన సీబీఐ దత్తపుత్రుడు లేరన్నది గమనార్హం. 
 
2014 తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీకి వచ్చిన ఓట్లు.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎలా రాళ్లతో కొట్టారో మరిచిపోయారా? అంటూ గతాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నాస్త్రాలు సంధించింది. 
 
అంతేకాదు 2014 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో వైసీపీకి నోటా కంటే తక్కువ వచ్చిన నియోజకవర్గాల జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదంతా చూస్తుంటే జగన్ బర్రెలక్క ప్రస్తావన తెచ్చి తప్పు చేశాడనే మాట వినిపిస్తోంది.