గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (17:09 IST)

ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం : ఆసరా పెన్షన్ రూ.3 వేలకు పెంపు

jagan
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ సారథ్యంలోని సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం... ఆసరా పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచాలని నిర్ణయించింది. జనవరి నెల నుంచి రూ.2750 పెన్షన్‌ను నెలకు రూ.3 వేలు చొప్పున ఇచ్చేలా తీర్మానం చేశారు. 
 
అలాగే, ఆరోగ్య శ్రీ పథకంలో వైద్య చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్టణం లైట్ మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం పొందిన డీపీఆర్, జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కూడా జనవరి నుంచి ప్రారంభంకానుంది. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరును కూడా సంస్కరించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
 
మాజీ సీఎం కేసీఆర్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించిన సీఎం రేవంత్ 
 
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించింది. ఆయన భద్రతను వై కేటగిరీకి కుదించింది. ఈ ప్రకారంగా ఫోర్ ప్లస్ ఫోర్ గన్‌మెన్లు, కాన్వాయ్‌లో ఒక వాహనం కేటాయించారు. ఇంటి వద్ద ఒక సెంట్రీ ఉంటుంది. 
 
అలాగే మాజీ మంత్రులుగా పని చేసి ఇపుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2 ప్లస్ 2 భద్రతను కల్పించారు. మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్లకు చైర్మన్లకు భద్రతను పూర్తిగా తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై  సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. 
 
ఇందులో భాగంగా, అనేక మంది ప్రముఖు సెక్యూరిటీని సమీక్షించింది. అలాగే మాజీలలో ఎవరికైన భద్రత అవసరమైతే, ఏజెన్సీ ఏరియాలో ఉన్న వారికి గన్‌మెన్లను ఇచ్చే అవకాశం ఉంది. అయితే, వీరికి సంబంధించి పూర్తిగా నిఘా విభాగం రివ్యూ చెసిన తర్వాతే భద్రతను కల్పించనున్నారు. 
 
యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్ అయిన మాజీ సీఎం కేసీఆర్ 
 
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబదా్ నగరంలోని నందవనంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. ఈ నెల మూడో తేదీన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. దీంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ రోజు సాయంత్రమే ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాత్రూమ్‌లో కాలుజారి పడటంతో కాలు తుంటె ఎముక విరిగిపోయింది. దీంతో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఈ నెల 8వ తేదీన తుంటి మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, తెలంగాణ మంత్రులు ఇలా అనేక మంది ప్రముఖులు పరామర్శించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన... బంజారా హిల్స్ నందినగర్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేంత వరకు ఈ ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే, ఆయన సంపూర్ణంగా కోలుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం అంటే రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.