గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 డిశెంబరు 2023 (11:40 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మన దేశమే కాదు ప్రపంచమే నవ్వుతోంది

Reddeppagari Madhavi
కర్టెసి-ట్విట్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మన దేశం మాత్రమే కాదు ప్రపంచ మొత్తం నవ్వుతోంది. రాష్ట్ర విభజన జరిగినా మనకి ఓ కేపిటల్ లేకుండా చేసారు అంటూ తెలుగుదేశం నాయకురాలు రెడ్డప్పగారి మాధవీరెడ్డి అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
 
వైసిపి నాయకులకు పనీపాటలేదు. అభివృద్ధి గురించి అసలు ఆలోచన లేదు. రోడ్డు లేకుండా నారా లోకేష్ పైన కేసులు పెడతారంట. ఉచితాలు అంటూ బటన్ నొక్కేస్తున్నారు. మద్యం షాపుల్లో ప్రజలు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న డబ్బు ఎక్కడికి పోతుందో చెప్పాలి. ప్రజల డబ్బులను వైసిపి ప్రభుత్వం పీక్కుతింటోంది అంటూ ఆమె మండిపడ్డారు.