సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జులై 2024 (20:02 IST)

మద్దూరు మహిషాసురమర్థిని.. మట్టిని తవ్వుతుండగా కంచు శబ్ధం..

Mahishasura Mardhini
Mahishasura Mardhini
తమిళనాడు, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని మద్దూరు గ్రామంలో మహిషాసురమర్థిని అమ్మవారి ఆలయం నెలకొని వుంది. ఈ ఆలయం 64 శక్తి పీఠాలతో ఒకటిగా పూజలు అందుకుంటోంది. 1954లో మద్దూరు సరిహద్దులో అరక్కోణం-రేణిగుంట రెండో రిజర్వ్‌ రోడ్డు నిర్మాణంలో శక్తిమేడు వద్ద కూలీలు బండరాయితో మట్టిని తవ్వుతుండగా.. ఓ చోట కంచు శబ్దం వినిపించింది. 
 
తదనంతరం, సహోద్యోగులు, స్థానిక ప్రజలు అక్కడ గుమిగూడి మట్టిని తొలగించగా, మహిషాసురమర్థిని దేవి ఉద్భవించింది. అనంతరం మద్దూరులో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ అమ్మవారు 8 చేతులలో శంఖం, చక్రం, విల్లు, బాణం, కత్తి, డాలు, త్రిశూలం, కబాల మాలను ధరించి వుంటుంది.
 
మహిషాసుర మర్దిని అమ్మవారు ఏడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తున వుంటుంది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య, పౌర్ణమికి 108 పాల కుండలతో అభిషేకం నిర్వహించడం విశేషం. 108 శంఖువులతో భక్తులు అభిషేకం చేస్తారు.