1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 మే 2024 (19:10 IST)

డైరెక్టర్స్ సమక్షంలో సత్య ట్రైలర్ లాంచ్ - వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధం

Hamaresh, Prathanna
Hamaresh, Prathanna
శివమ్ మీడియా నిర్మాణ సంస్థ నుండి  తొలి సినిమా సత్య ట్రెయిలర్ ఈరోజు 8 మంది దర్శకుల చేతుల మీదగా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు.

హీరోయిన్ ప్రార్థన సందీప్ మాట్లాడుతూ : తమిళ్ లో సినిమా మంచి హిట్ అయ్యింది, ఈరోజు తెలుగులో మాకు శివ మల్లాల గారు మంచి స్టేజ్ ఇచ్చారు. తెలుగులో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
హీరో హమరేష్ మాట్లాడుతూ,  శివ మల్లాల గారి ఇన్స్పిరేషన్ స్టోరీ వింటున్నప్పుడు నాకు గూస్ బంబ్స్ వచ్చాయి. ఇలాంటి వ్యక్తి చేతుల మీదగా తెలుగులో లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.
 
డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ : హమరేష్ చూడడానికి  జి.వి. ప్రకాష్ లాంచ్ అయినప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. నిర్మాత శివ మల్లాల నాకు నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి తెలుసు, నన్ను జనాలకి చూపించడానికి ఫొటోస్ తీసేవారు, నా మొహమాటాన్ని కూడా దాటి శివ కోసం ఫొటోస్ దిగేవాడిని. ఆయనకి ఈ సినిమా పెద్ద సక్సెస్ ని తీసుకుని రావాలని కోరుకుంటున్నాను ‘సినిమాలో సరస్వతి ఉన్నారు కాబట్టి, ఈ సినిమాతో మా శివ మల్లాల కి లక్ష్మి కూడా రావాలి’ అని కోరుకుంటున్నాను అన్నారు.
 
డైరెక్టర్ శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ : సత్య ట్రైలర్ చాల బాగుంది, టీం అందరికీ అల్ ది బెస్ట్, శివ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయనా అలానే నవ్వుతూ ఉండాలి అలానే మంచి సక్సెస్ లు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
రైటర్, డైరెక్టర్ సతీష్ వేగేశ్న మాట్లాడుతూ: ఇండస్ట్రీలో మనం ఎవరితో అయినా ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు మొదట్లో ఒకలా ఉన్నా, పోను పోను వారి ప్రవర్తన మారిపోతు ఉంటుంది. కాని శివ మల్లాల మాత్రం డే వన్ నుండి ఈరోజు వరుకు అదే ప్రవర్తన, అదే మంచి తనంతో ఉన్నారు. ఇప్పుడు నిర్మాతగా చేస్తున్నాడు, ప్రతి సినిమాకి ఫ్రైడే రోజు రివ్యూ చెప్తూ ఉంటాడు, అలా తియ్యొచ్చు ఇలా తియ్యొచ్చు అని, ఇప్పుడు శివ నే సినిమా నిర్మాణం చేస్తున్నప్పుడు కచ్చితంగా అలాంటి లోపాలు ఏమి లేకుండానే చేస్తాడు అనుకుంటున్నాను. కచ్చితంగా శివకి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ : ఈ సత్య కచ్చితంగా హిట్టు అవుతుంది. ఎందుకంటె శివ గారు భాషతో సంబంధం లేకుండా టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు నాకు వాటి ఎనాలిసిస్ చెప్పే వారు. అది ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది అని, ఆయన ఒక 100 సినిమాలకి అల చెప్పి ఉంటే 90 శాతం అయన చెప్పినట్టే జరిగేది అంత జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అని అన్నారు.
 
 దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ : తమిళ్ లో ఈ సినిమాని నేను రంగోలి గా తీసాను, ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల గారి ద్వార వస్తుంది, అందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
 
నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ : ఈరోజు నేను సినిమా చేస్తున్నప్పుడు నాకోసం ఇంత మంది వచ్చి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఈ సినిమా చూసి రివ్యూ చెప్దామని అనుకున్నాను, కానీ సినీమా చూడగానే నాకు బాగా నచ్చింది వెంటనే వాలి మోహన్ దాస్ కి కాల్ చేసి అప్రిషియేట్ చేశాను, తెల్లవారుజామున 4 గంటలకి వాలికి నేను అడ్వాన్స్ ఇచ్చాను. ఈరోజు జస్ట్ ట్రైలర్ లాంచ్ అనే మాట చెప్పడం కోసం ఎనిమిది మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను ఫోటోగ్రాఫర్ గా స్టార్ట్ అయ్యి ప్రొడ్యూసర్ వరుకు వచ్చాను అంటే అది కేవలం నాకు నా కెరీర్ ముందు నుండి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. 10 న సత్య సినీమా వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి అని అన్నారు.