1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 మే 2024 (17:40 IST)

పెళ్ళైన జంట మధ్య సాగే కథతో విద్య వాసుల అహం

Rahul Vijay  Shivani Rajasekhar
Rahul Vijay Shivani Rajasekhar
కొత్తగా పెళ్ళైన కపుల్ డ్రామాలు తెలుగులో ఇప్పటికే కొన్ని వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం కొంచం ప్రత్యేకం అని చెప్పొచ్చు, రాహుల్ విజయ్ వాసు గా, శివాని రాజా శేఖర్ విద్య పాత్రలో భార్య భర్తలు అని పోస్టర్ లో తెలుస్తుంది. టైటిల్ లో కూడా వివాహం అనేది హైలైట్ అయ్యేలా ఉంది. ట్యాగ్ లైన్ ‘ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ ‘ అని ఉంది. ఈ మోడ్రన్ డేస్ లో పెళ్ళైన జంట మధ్యన ప్రేమతో పాటు ఈగో కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది. పోస్టర్ లో చూస్తుంటే భార్య భర్తలు ఇద్దరూ వారీ వివాహ బంధంలో వచ్చే ఈగోలని టిట్ ఫర్ టాట్ గా ప్రయోగిస్తూ ఉంటారు అన్నట్టు అర్థమౌతుంది. 
 
ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నవ్య మహేష్, ఏం రంజిత్ కుమార్ కొడాలి, చందనా కట్టా నిర్మాతలుగా, మణికాంత్ గెల్లి దర్శకత్వంలో ఆహా లో త్వరలో రిలీజ్ కాబోతుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.