బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (18:15 IST)

కోట బొమ్మాళి పి ఎస్ లో ఏం జరిగింది? రివ్యూ

Kota bommali
Kota bommali
నటీనటులు: శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, మురళీ శర్మ
 
సాంకేతికత- సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి, సంగీతం: రంజిన్ రాజ్, నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా, దర్శకుడు : తేజ మార్నికొప్పినీడి
 
దాదాపు ఈ వారం 9 సినిమాలు విడుదలయ్యాయి. అందులో మలయాల సినిమా నాయట్టు’ కి  రీమేక్ గా చేసిన “కోట బొమ్మాళి పి ఎస్” కూడా ఒకటి.  శ్రీకాంత్, శివాని రాజశేఖర్ అలాగే రాహుల్ విజయ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
 
కథ :
శ్రీకాకుళం కోట బొమ్మాళి ప్రాంతంలో నగ్జలైట్ల కూంబింగ్ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన పోలీసు రామకృష్ణ(శ్రీకాంత్). పై అధికారి రజియా అలీ(వరలక్ష్మీ శరత్ కుమార్) ఆద్వర్యంలో ఎన్ కౌంటర్లు చేస్తాడు. కొన్నాళ్ళకు కోట బొమ్మాళి పి.ఎస్.కు రవి(రాహుల్ విజయ్),  కుమారి (శివాని రాజశేఖర్) కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతారు. అదే టైంలో బై ఎలక్షన్ వస్తుంది. ఈ క్రమంలో ఈ ముగ్గురూ ఓ పొలిటికల్ పార్టీ నాయకుడి ఇంటిలో పెండ్లికి వెళ్ళి తిరిగి జీపులో వస్తుండగా హోమ్ మినిష్టర్ పరిసల జైరాజ్(మురళీ శర్మ) పార్టీ అనుచరుడు ఏక్సిడెంట్ కు గురయి చనిపోతాడు. అది వీరిపై పడుతుంది. వెంటనే వీరు ఊరి వదిలి పారిపోయే ప్లాన్ వేస్తారు. వీరి కోసం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్) ని హోమ్ మినిష్టర్ పరిసల జైరాజ్ నియమిస్తాడు. ఆ తర్వాత వారిని ఆమె పట్టుకుందా? లేదా? అనేది కథ. 
 
సమీక్ష-
ఇది అప్పటికీ  ఇప్పటికీ  ఎప్పటికీ మారని పొలిటికల్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మధ్య జరిగే కథ. అవసరానికి పొలిటీషన్ పోలీసులను ఏ విధంగా ఉపయోగించుకుంటారు. పని అయ్యాక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది బాగా చూపించారు. రాజ్యాంగాన్ని రాసేది సెక్యూరిటీ గార్డ్ గా, కుక్క ను పోలీసు గా కుక్కను కంట్రోల్ చేసే తాడు చట్టంగా హోం మంత్రి ఓ సన్నివేశంలో పోల్చడం సన్నివేశపరంగా బాగా సింక్ అయింది. పార్టీ అనుచరులు, ఒకే కులం వారు ఓటు బ్యాంక్ రాజకీయం, ఓటుకు డబ్బు పంచే విధానం కళ్ళకు కట్టినట్లు చూపించాడు. మరోవైపు పారిపోయిన ముగ్గురు కుటుంబాల భావెోద్వేగాలు, కుటుంబాలఎమోషన్స్ బాగున్నాయి.  
 
పోలీసులకు దొరక్కుండా శ్రీకాంత్ వేసే ఎత్తులు వరలక్మి శరత్ కుమార్ పై ఎత్తులు కథనాన్ని బాగా రక్తి కట్టించాయి. శివాని, రాహుల్ విజయ్ లు ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ లను అందించారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తరహా సినిమాలను చూసేవారిని మెప్పిస్తుంది. మెయిన్ గా ఇది ఎమోషనల్ అండ్ క్లీన్ ఎండింగ్ సినిమాని పర్ఫెక్ట్ గా ముగుస్తుంది.
 
కథ ప్రకారం ఇది సీరియస్ మూవీ. ఇందులో పాటలు కానీ, ఎంటర్ టైన్ మెంట్ కానీ వుండదు. ఒరిజినల్ తో పోలిస్తే శ్రీకాంత్ రోల్ ని ఇంకాస్త డెప్త్ గా ప్రెజెంట్ చేసి ఉంటే సినిమా లో తన మరింత ఎఫెక్టివ్ గా అనిపించవచ్చు
 
ఈ చిత్రంలో గీతా ఆర్ట్స్ 2  నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా నేపథ్యంకి తగ్గట్టుగా చాలా నాచురల్ గా సినిమాని తెరకెక్కించారు. టెక్నీషియన్ టీం లో రంజిన్ రాజ్ మ్యూజిక్ బాగుంది. అలాగే జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు తేజ మార్ని మంచి సబ్జెక్ట్ ని డీసెంట్ నరేషన్ తో ప్రెజెంట్ చేశారు. కొన్ని లోటుపాట్లు మినహా థ్రిల్ కలిగించే సినిమా.
 
ఈ కథ ఇప్పటి రాజకీయ ముఖచిత్రం అని చెప్పవచ్చు. ఓటు కోసం ప్రజలు కొట్టుకోవడం, కులాలతో రాజకీయ నాయకులు ఆడుకుని ఓటు బ్యాంక్ గా మార్చు కోవడం అనే అంశంతో పలు సినిమాలు వచ్చాయి. కానీ ఈ చిత్రం ఓ మైండ్ గేమ్ ట్విస్ట్ లు సహా ఎమోషనల్ క్లైమాక్స్ తో మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
రేటింగ్.. 3.5